కళా ప్రియులకు శుభాభివందనములు.
నాట్యం ఒక మహానది. సంగీతం, సాహిత్యం, అభినయం వంటి జీవ నదులు సమపాళ్ళలో సంగమించగా ఒక ఉత్తుంగ తరంగం ఎగసి ఎగసి నింగి అంచును ముద్దాడి కరుణమృత సముద్రుడౌ ఆ నల్లనయ్య పాదలను అభిషేకించి ఈ నేలను పునీతం చేసి నాట్యం గా అవతరించింది. శృతి బద్ధం గా గళములో గీతం కదలాడుతుంటే, లయ బద్ధం గా పాదం కదులుతుంతే దృష్టి చేతుల గమనం మీద లగ్నమై ఆ దృష్టి మనసును మమేకం చేసి భావాన్ని పండించగా రస సిద్ధి కలుగుతుంది. ఆ స్థితి చేసేవారికే కాకుండా చూసేవారికి కూడ కలిగించటమే నాట్యం యొక్క ముఖ్యుద్దేస్యం.
అటువంటి నాట్యం నా జీవన గమనమైనందుకు ఆ నల్లనయ్య కు నా కృతజ్ఞత తెల్పుకుంటున్నాను. నా ఈ బ్లాగ్ ప్రస్తుత నాట్యాభివృద్ధి గురించి ప్రస్తావిస్తూనే నాట్య పూర్వవైభవాన్ని మీ ముందు వుంచుతుంది. ఈ రంగం అభివృద్ధి కి పలు ప్రముఖులు చేసిన కృషి మొదలగునవి ప్రస్తావించబడతాయి. ఇక పై నా టపాలన్నీ నాట్యానికి సంబంధిచినవే కావున ఈ ముందుమాటలో దాని గూర్చి పెద్దగా ఏమీ ప్రస్తావించలేదు.
ధన్యవాదములు.
Wednesday, January 23, 2008
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
good effort...please continue...
Welcome ....
మీవంటి కళాకారిణి బ్లాగు మొదలు పెట్టడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం. మీ సాలెగూడు కూడా చూశాను. మంచి కళాత్మకంగా రచింపచేశారు .. అభినందనలు.
నాట్యంలోని వివిధ అంశల గురించి మీ అభిప్రాయాల్ని మీ బ్లాగుద్వారా పంచుకుంటారని ఎదురు చూస్తుంటాము.
Post a Comment